అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో మంత్రి లోకేష్ కుటుంబం

4 weeks ago 5
ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్‌ తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌లతో కలిసి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. తలకు సంప్రదాయ వస్త్రాన్ని చుట్టుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారికి స్వర్ణమందిర్‌ చరిత్ర, విశేషాలు, ప్రత్యేకతల్ని శ్రీహర్మందిర్‌ సాహిబ్‌ నిర్వాహకులు వివరించారు. నిత్యం వేల మంది భక్తుల ఆకలి తీర్చే స్థానిక లంగర్‌హౌస్‌ను పరిశీలించారు. రోజుకు ఎంత మందికి ఆహారం అందిస్తారు? వండించే పదార్థాలేంటి.. ఇందుకోసం ఎంత మంది పనిచేస్తారు? తదితర వివరాల్ని లోకేశ్, బ్రాహ్మణి తెలుసుకొన్నారు. 'అందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించాను. పవిత్ర హర్మందిర్‌ సాహిబ్‌ను సందర్శించే భాగ్యం దొరకడం సంతోషంగా ఉంది. సిక్కు గురువుల ఆశీస్సులు పొందాను. ఆ ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చింది' అన్నారు లోకేష్.
Read Entire Article