హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ల ముఠా అమెరికాలోని దాదాపు 20 లక్షల మందిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. అమెరికా ప్రభుత్వ అధికారులమంటూ వృద్ధులను బెదిరించి నగదు, బంగారం వసూలు చేశారు. 927 లావాదేవీల ద్వారా రూ.261 కోట్లు సేకరించినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో తాజాగా మరో నలుగురిని అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. నిందితులకు చెందిన రూ.400 కోట్ల ఆస్తులపైనా దర్యాప్తు కొనసాగుతోంది.