అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. సుచిత్రకు చెందిన శ్రీవెంకట్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న కారును మినీ ట్రక్కు ఢీకొట్టింది. ఆ వెంటనే కారులో మంటలు చెలరేగి కుటుంబ సభ్యులు నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది.