హైదరాబాద్ యువతి నిఖిత గోదిశాల అమెరికాలో హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా గాలింపు చేపట్టి ఆగ్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుర్తించారు. నిఖిత మృతదేహం మేరీల్యాండ్‌లోని అర్జున్ నివసించిన అపార్ట్‌మెంట్‌లో లభించగా.. ఆమె శరీరంపై కత్తిపోట్ల గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక వివాదమే హత్యకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.