ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతుంది. అధికారులు ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన వారిలో అర్హుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ జాబితా ప్రకారం చూసుకుంటే మొత్తం 50,815 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. ఈ ఎన్నికల కోసం కూటమి, వైసీపీల నుంచి భారీ స్థాయిలో నామినేషన్లు వేయడం జరిగాయి. అందులో కొందరు వెనక్కి తీసుకోవడం, సాంకేతిక కారణాల రీత్యా ఎన్నికల సంఘం చెల్లుబాటయ్యే నామినేషన్లను ఖారారు చేసి వాటి వివరాలను వెల్లడించింది.