చిల్లర విషయంలో ప్రయాణికురాలితో జరిగిన వాగ్వాదం మహిళా ఆర్టీసీ కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో బాలుడి టికెట్, మిగిలిన చిల్లరపై వివాదం తలెత్తింది. మిట్టగూడెం వద్ద ప్రయాణికురాలు నెట్టివేయడంతో కండక్టర్ ప్రవళిక కదులుతున్న బస్సు వెనుక చక్రాల కింద పడ్డారు. తొలుత భద్రాచలం ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కండక్టర్పై దాడిని ఖండించిన ఆర్టీసీ ఉద్యోగుల సంఘం సిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.