Sandhya Theatre Stampede Case: పుష్ప-2 సినిమా కోట్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంటే.. ప్రీమియర్ రోజు హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట మాత్రం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించటం, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిపోవటం.. ఈ మొత్తం ఘటనకు అల్లు అర్జున్‌ను బాధ్యున్ని చేస్తూ అరెస్టు చేయటం, బెయిల్ మీద బయటకు రావటం అన్నీ తెలిసిందే. కానీ.. రేవతి కూతురి పరిస్థితి చూస్తుంటే.. గుండెలు బరువెక్కుతున్నాయి.