దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం రోజు దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. దావోస్, సింగపూర్ పర్యటనల్ని విజయవంతంగా ముగించుకొని భారీగా పెట్టుబడులతో తిరిగొచ్చారంటూ కొనియాడారు నేతలు, కార్యకర్తలు. దావోస్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1.79 లక్షల కోట్ల మేర పెట్టుబడులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం. గత పర్యటన కంటే ఈసారి 4 రెట్లు పెరగడం విశేషం.