నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ పరిధిలోని ఎల్లాపురం తండాలో శిశు విక్రయ ఘటన వెలుగు చూసింది. కొర్ర బాబు – పార్వతి అనే గిరిజన దంపతులు, తమకు ఆడపిల్లలు పుట్టారనే వివక్ష.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. నలుగురు సంతానంలో ఇద్దరు ఆడపిల్లలను వేర్వేరు సమయాల్లో గుంటూరు జిల్లాకు చెందిన వారికి అమ్మేశారు. చెల్లిని అమ్మొద్దని అక్కలు కన్నీళ్లు పెట్టుకున్నా తల్లిదండ్రులు వినలేదు. ఈ దారుణంపై ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందింది.