అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్

11 months ago 21
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీపై అధికారులు చర్యలు తీసుకోకుంటే.. కంపెనీని తగలబెడతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఈరోజు సమయం ఇచ్చారు. శనివారం లోపల చర్యలు తీసుకోకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకి అరబిందో ఫార్మా కంపెనీ తగలబెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. కొన్నేళ్లుగా అరబిందో కంపెనీ యాజమాన్యం కాలుష్యపు నీటిని బయటకు వదులుతుండటంతో పంటలకు నష్టం కలుగుతోందని, ముదిరెడ్డిపల్లి చెరువులో చేపలు చనిపోతున్నాయని అనిరుధ్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై శాసనసభలో చర్చించినా.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక తనకు ఓపిక లేదని, శనివారం చర్యలు తీసుకోకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు పరిశ్రమను తగలబెడతానని హెచ్చరించారు.
Read Entire Article