శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల కట్టడికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా సీసీ కెమెరాలు, డ్రోన్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివరాలను వెల్లడిస్తూ ఏఐ సాయంతో క్రియేట్ చేసిన వీడియోను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పంచుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇందులో ఓ దొంగకు, సీసీ కెమెరాకు మధ్యన ఫన్నీ సంభాషణ ఉండేలా రూపొందించారు.