Young Man into Girls Hostel: అర్ధరాత్రి సమయంలో ఓ యువకుడు.. గర్ల్స్ హాస్టల్‌లోకి ప్రవేశించాడు. అదేదో సినిమాల్లో వచ్చే సీన్ గురించి చెప్పటంలేదు. నిజంగానే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలో జరిగింది. ఓ యువకుడు శుక్రవారం (అర్ధరాత్రి 25న) హాస్టల్‌లోకి దూరాడు. ఆ యువకున్ని చూసి.. హాస్టల్‌లోని బాలికులు అరుపులు కేకలతో ఊదరగొట్టారు. అమ్మాయిల అరుపులతో స్థానికులు పరుగెత్తుకుంటూ రావటంతో.. వాళ్లను చూసి ఆ యువకుడు జంపయ్యాడు.