బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో నిరాధారమైన వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తన మాటల వల్ల కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. కొండా సరేఖ తాజాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.