చేయూత పింఛన్ల పథకంలో అనర్హులకు చెల్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో చేపట్టిన పైలట్ సర్వేలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి తల్లిదండ్రులతో సహా 9 మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనర్హులను తొలగించి, అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.