అల్లుడికి 630 వెరైటీలతో విందు.. వీడియో చూస్తే మాత్రం!

5 days ago 4
గోదావరి జిల్లాల్లో అత్తింటికి వెళ్లే అల్లుళ్లకు అత్తామామలు ఏ రేంజులో మర్యాదలు చేస్తుంటారో.. ఆ మర్యాదలు ఎలా ఉంటాయనే దానిపై ఈ మధ్య కాలంలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. పండగకు అత్తింటికి వచ్చిన కొత్తల్లుడికి 100 ఐటమ్స్‌తో విందు.. 200 రకాలతో విందు.. 400 వంటకాలతో విందు.. ఇలా చాలా వీడియోలు చూశాం. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పండగకి ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఇలాంటి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అల్లవరం గ్రామానికి చెందిన జంగా బుజ్జి, వాసవి దంపతులు.. జర్మనీ నుంచి వచ్చిన అల్లుడు హేమంత్‌కు ఇలా సర్ ప్రైజ్ ఇచ్చారు. రకరకాల పిండి వంటలు, వెజ్, నాన్‌వెజ్ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలా 630 వెరైటీలతో అల్లుడి కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఐటమ్స్ అన్నీ జాగ్రత్తగా పేర్చి వీడియోలు తీసి మీడియాకి ఇచ్చారు. అయితే ఈ వీడియోను గమనిస్తే.. అన్నీ కిరాణా షాపుల్లో కొనేసినవే. ఆఖరికి బింగో, లేస్ చిప్స్ వంటివి కూడా ఉన్నాయి. మొత్తంగా ఇందులో ఐదారు వంటకాలు మాత్రమే ఇంటిలో చేసినట్టుగా ఉన్నాయని ఈ వీడియో చూసిన జనం అభిప్రాయపడుతున్నారు.
Read Entire Article