జగిత్యాలలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పవన్ కుమార్ సజీవ దహనం కేసులో జగిత్యాల కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఈ కేసులో పవన్ కుమార్ సతీమణితో పాటుగా ఐదుగురు మహిళలకు జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ప్రకటించారు. 2020 అక్టోబర్ నెలలో ఈ ఘటన చోటుచేసుకోగా.. చేతబడి అనుమానంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టడం సంచలనం రేపింది.