ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో హిల్ట్ పాలసీ ఇష్యూ ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ పాలసీని ప్రవేశపెట్టినట్లు సర్కార్ చెబుతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటకు తరలించి, ఆ భూములను నివాస, వాణిజ్య అవసరాలకు మార్చనున్నట్లు తెలిపారు. అయితే ఈ పాలసీపై ప్రతిపక్షాలు భూ కుంభకోణమని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం పర్యావరణ పరిరక్షణ, ఆదాయ మార్గంగా దీన్ని సమర్థిస్తోంది. అసలు ఈ పాలసీ ఏంటో ఓసారి తెలుసుకుందాం..