అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన అధికారి.. సమయస్ఫూర్తితో వ్యవహరించి CPR చేసిన మంత్రి

48 minutes ago 1
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం మానవీయ ఘటన చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. పరిస్థితిని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి సీపీఆర్ చేశారు. అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి అంబులెన్స్‌లో రాజును ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర సమయంలో మంత్రి చూపిన సమయస్ఫూర్తి, చొరవపై అసెంబ్లీ సిబ్బంది, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Entire Article