స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనపై కేటీఆర్, హరీశ్‌రావు, నవీన్ కుమార్, సుధీర్‌రెడ్డి తదితరులపైనా బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిసింది.