పేదలకు గుడ్‌న్యూస్‌.. అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌, మంత్రి కీలక ప్రకటన

1 hour ago 1
తెలంగాణలో పేదలకు సొంతిళ్లు అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్‌ తరహా గృహ సముదాయాలను ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ నిర్మించనుంది. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇళ్లలో 1.97 లక్షలు పూర్తయ్యాయి. దసరా నాటికి 2 లక్షల గృహప్రవేశాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో విడతలో మరో 2 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. ఈ నెల 20లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేయనున్నారు. క్యూర్‌ పరిధిలో లక్ష ఇళ్లను టవర్ల రూపంలో నిర్మించేందుకు త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Read Entire Article