AP New Pension House Tax Assessment Number Exemption: ఏపీలో పింఛన్లకు సంబంధించి దరఖాస్తలు స్వీకరణ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ దరఖాస్తుకు.. ఇంటి పన్ను ఎసెస్‌మెంట్ నంబర్ తప్పనిసరి కాదని తెలిపింది. ఈ మేరకు అవసరమైన మార్పులు చేసి.. బుధవారం నుంచి ఈ విధానం అందబాటులోకి వస్తుందని తెలిపారు.