తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని 14 గ్రామాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ గ్రామాల్లో మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు ఉంటారు. ప్రజలకు రెండు ఓటర్ ఐడీలు, రెండు రేషన్ కార్డులు ఉంటాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వీటిని తమవిగా వాదిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వివాదం సుప్రం కోర్టులో ఉంది.