ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఐదు కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసిన టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కళిశెట్టి అప్పలనాయుడు.. తూర్పుకాపు, శిష్టకరణం, సొండి, కళింగ వైశ్య, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. అలాగే రైల్వే మంత్రిని కూడా కలిసిన ఉత్తరాంధ్ర నేతలు.. ఆ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ ఎక్స్‌ప్రెస్, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, పూరి- తిరుపతి రైళ్లకు స్టాపేజీ ఇవ్వాలని కోరారు.