హైదరాబాద్ మాదాపూర్‌లోని సున్నం చెరువు నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడటానికి వీల్లేదని హైడ్రా హెచ్చరించింది. నీటి నాణ్యత కోసం జరిపిన పరీక్షల్లో దిగ్భ్రాంతికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ చెరువులోని భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్లు తేలింది. ముఖ్యంగా సాధారణ స్థాయి కంటే 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నీటిని నిత్యావసరాలకు కూడా వాడొద్దని హైడ్రా హెచ్చరించింది.