ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరీంనగర్ పట్టణంలో ఒక లా కాలేజీ, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కళాశాల కోసం ఎప్పటినుంచో విద్యార్థులు ఎదురు చేస్తున్నారు. ప్రస్తుత ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో మేలు కలగనుంది.