రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పట్టణంలోని ఎండబెట్ల దగ్గర ఉన్న కేసరి సముద్రం మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన పనులను మంత్రి దామోదర్ రాజనర్సింహ, స్థానిక శాసన సభ్యులు రాజేష్ రెడ్డి , శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణ పనుల కోసం రూ. 20 కోట్లతో శంకుస్థాపన పనులను ప్రారంభించారు.