Vizianagaram District S Kota Three National Highways: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఉత్తరాంధ్రలో మూడు కీలక జాతీయ రహదారుల విస్తరణ పనులు వేగవంతం అయ్యాయి. విశాఖపట్నం-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, పెందుర్తి-బొడ్డవర 516బి, రాజమహేంద్రవరం-విజయనగరం 561ఈ రోడ్లు పరిశ్రమలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించనున్నాయి. ఈ జాతీయ రహదారుల అభివృద్ధి వల్ల రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నారు.