ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో బంగారం ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరు, లేదా నవంబర్ నెల ప్రారంభం నుంచి జిల్లాలో బంగారం ఉత్పత్తి మొదలు కానుంది. జిల్లాలోని బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసరాల్లో 597.82 హెక్టార్లలో విస్తరించిన బంగారు నిక్షేపాలను వెలికితీసేందుకు జియో మైసూర్ సర్వీసెస్ ముందుకు వచ్చింది. రూ.500 కోట్ల ప్రాజెక్టుతో బంగారం ఉత్పత్తి ప్రారంభించి, ఏడాదికి 500 కిలోల బంగారాన్ని తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఈ ఉత్పత్తిని రెట్టింపు చేయనున్నారు.