Solar Manufacturing Complex AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీ సోలార్ ప్రాజెక్ట్ రాబోతోంది. తిరుపతి జిల్లా, నాయుడుపేటలో రూ.3538 కోట్ల పెట్టుబడితో 8 గిగావాట్ల సామర్థ్యంతో వెబ్‌సోల్ సంస్థ ఈ మెగా ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ తయారీ కేంద్రంగా ఇది మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 2027 నుంచి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.