హైదరాబాద్‌లో మసీదు కోసం సానియా మీర్జా భూమి విరాళంగా ఇచ్చారా.. తండ్రి వ్యాఖ్యలు

1 hour ago 1
హైదరాబాద్‌లో మసీదు నిర్మాణం కోసం సానియా మీర్జా భూమిని విరాళంగా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. సానియా టెన్నిస్ అకాడమీ ఉన్న స్థలంలో మసీదు నిర్మాణం జరగడం లేదని స్పష్టం చేశారు. మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి సానియా శంకుస్థాపన చేస్తున్నట్లు వైరల్ అయిన ఫొటోను ఏఐ సాయంతో రూపొందించారని తెలిపారు. తన తండ్రి వివరణను సానియా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
Read Entire Article