Ongole Mega Drinking Water Project: ఒంగోలు వాసుల దశాబ్దాల నీటి కష్టాలు తీరనున్నాయి. అమృత్-2 పథకం కింద రూ.482 కోట్లతో మెగా తాగునీటి ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాబోయే 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నీటిని అందించే ఈ ప్రాజెక్టుతో, ట్యాంకర్లపై ఆధారపడటం తగ్గి, ప్రతి ఇంటికీ పైపులైన్ల ద్వారా నిరంతరాయంగా నీటి సరఫరా అందుతుంది. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. 18 నెలల్లోగా వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.