Rayadurgam Toll Gate: రాయదుర్గం- అనంతపురం హైవేపై కదరంపల్లిలో కొత్త టోల్‌ప్లాజా మొదలైంది. NHAI ఆధ్వర్యంలో రాజారాం-గోదారా కంపెనీ దీన్ని నిర్వహిస్తోంది. అయితే, రైల్వే వంతెన, సర్వీస్ రోడ్ల పనులు ఇంకా పూర్తికాకముందే టోల్ వసూళ్లు మొదలవడం చర్చనీయాంశమైంది. మొదటి ఏడాది టోల్ ధర తక్కువగా ఉంటుందని మేనేజర్ చెబుతున్నారు. అనంతపురం-గుంటూరు హైవే విస్తరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.