వరంగల్ ఇన్నర్ రింగురోడ్డు పనులకు మోక్షం కలగనుంది. మొదటి విడత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.107 కోట్లు కేటాయించింది. అదనపు రోడ్డు నిర్మాణ పనులకు మరో రూ.30 కోట్లు సైతం మంజూరు చేశారు. రంగశాయిపేట నాయుడు పెట్రోల్‌పంపు జంక్షన్ నుంచి దూపకుంట క్రాస్‌రోడ్, ఖిలావరంగల్ తూర్పుకోట, స్తంభంపల్లి, జానీపీరీల వరకు ఇన్నర్ రింగు రోడ్డు నిర్మించనున్నారు.