స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలివే అంటూ జరుగుతున్న ప్రచారంపై జనసేన స్పందించింది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాల్లో అధినేత పవన్ కళ్యాణ్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. పార్టీ విధివిధానాలు అందరూ పాటించాలంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.