AP High Court Damodar Naidu: ఏపీ పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.. ఆయన నియామకాన్ని రద్దు చేసింది. దామోదర్‌నాయుడు గతేడాది పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ పదవీ విరమణ చేయగా.. ఆ వెంటనే ప్రభుత్వం ఆయన్ను తిరిగి అదే పోస్టులో నియమించింది. ఈ నియామకంపై పలువురు ఉద్యోగ సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు.. పిటిషనర్ల తరఫున లాయర్లు వాదనలు వినిపించగా.. విచారణ చేపట్టిన కోర్టు ఆయన నియామకాన్ని రద్దు చేసింది.