Visakhapatnam Vande Bharat Coaches Increased To 20: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త! విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు డిమాండ్ పెరగడంతో అధికారులు అదనంగా నాలుగు కోచ్‌లను జోడించారు. దీంతో మొత్తం 20 కోచ్‌లతో రైలు సామర్థ్యం 1,128 నుంచి 1,440కి పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు తిరుపతికి స్లీపర్ క్లాస్ వందే భారత్ రైలు డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.