ఆ రూల్ ఎత్తేస్తున్నాం.. మండలిలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన పవన్ కళ్యాణ్

2 months ago 4
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ శాసనమండలిలో మంగళవారం పంచాయతీరాజ్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని చెప్పిన డిప్యూటీ సీఎం.. డంపింగ్‌ యార్డ్‌ సమస్య ప్రధానంగా మారిందని అభిప్రాయపడ్డారు. మండలం యూనిట్‌గా డంపింగ్‌ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి రూ.104.81 కోట్లు ఖర్చు చేశారని పవన్ మండిపడ్డారు. మరోవైపు ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు నిబంధనను మారుస్తూ చేసిన కొత్త బిల్లును పవన్ కళ్యాణ్ మండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
Read Entire Article