Guntakal Rail Over Rail Bridge Works: కర్నూలు జిల్లాలో రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. చిప్పగిరి మండలంలో మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్, బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. గుంతకల్లు స్టేషన్‌లోకి రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.