కేంద్రం ఏపీకి పన్నుల్లో వాటాను విడుదల చేసింది. సాధారణంగా ఇచ్చే నెలవారీ పన్నుల పంపిణీకి అదనంగా ఈ ఏడాది మరో ముందస్తు విడత కింద కలిపి అన్ని రాష్ట్రాలకు రూ.1,09,019 కోట్లను విడుదల చేశారు. వీటిలో కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఈ తరహాలో రెండోసారి అదనపు విడత నిధులను విడుదల చేయడం విశేషం. ఈ పన్నుల నిధుల్లో ఉత్తరప్రదేశ్ అత్యధికంగా రూ.19,208 కోట్లు దక్కించుకుంది.