Andhra Pradesh Rains Today: ఏపీపై ద్రోణి ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన చేశారు. ఉత్తరాంధ్ర, కొోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో వానలు పడతాయంటున్నారు. ఈ వర్షాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వానలతో కాస్త ఊరట దక్కనుంది. ఇవాళ ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.