Harish Kumar Gupta May Be Andhra Pradesh Next Dgp: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ ఎవరనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త పోలీస్ బాస్‌గా ఎవరనేది చర్చనీయాంశమైంది. ఈ రేసులో సీనియర్ ఐపీఎస్ హరీష్‌కుమార్ గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన డీజీపీ కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. త్వరలోనే కొత్త డీజీపీ ఎవరనేది తేలనుంది.