ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే ఏపీలో మరో ఐఐటీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ఏపీలో తిరుపతి ఐఐటీ మాత్రమే ఉంది. అయితే విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీని.. ఐఐటీగా మార్చాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని.. ఐఐటీ వైజాగ్‌గా అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనలు మళ్లీ ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు.. ఆంధ్రా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌తో జరిపిన అంతర్గత సంభాషణల్లో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది.