మన దేశంలో పురాతన ఆలయాలు అనేకం ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలోని రాధా వేణుగోపాల స్వామి ఆలయం. కళింగ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆంధ్రా ఖజురహో అని కూడా పిలుస్తారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని కొత్తగా పెళ్లైన జంటలు శోభనానికి ముందే దర్శించుకుంటాయి. అలా ఎందుకు చేస్తాయి.. ఈ ఆలయానికి ఇంకా ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయనేదీ ఇప్పుడు చూద్దాం.