ఆంధ్రప్రదేశ్‌కు.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రానున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, సీఎం విజయ్ సమావేశం కానున్నారు. భేటీలో వీరు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న కొన్ని కీలక సమస్యలపై చర్చించుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా తమిళనాడు సీఎం విజయ్ కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.