ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ముస్కు సిద్ధార్థ రెడ్డి అనే యువకుడు చదవుల్లో సత్తా చాటాడు. వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. ఇప్పటికే గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు పొందిన సిద్ధార్థ.. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈసీజీసీ లిమిటెడ్‌లో పీఓగా ఎంపికయ్యారు.