ఆయిల్‌పామ్ రైతులను ఫంగస్ తెగులు పేరుతో కొందరు విక్రయదారులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఆయిల్ పామ్ తోటలకు వ్యాధి సోకిందంటూ ప్రచారం చేసి.. తమ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు ఆయిల్‌పామ్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను సంప్రదించగా.. అలాంటి తెగులును ఇప్పటివరకు గుర్తించలేదని పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాన్ని రైతులు గుడ్డిగా నమ్మకుండా, నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.