ఒక్క చేప ఏకంగా రూ.80 వేలు పలికింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారులకు మగ కిచిడి చేప చిక్కింది. దాదాపు 24 కేజీలు బరువుంది. ఈ చేపకు స్థానిక హార్బర్‌లో వేలం నిర్వహించగా.. ఓ వ్యాపారి రూ.80000లు పెట్టి మరీ సొంతం చేసుకున్నారు. ఎందుకంటే ఈ చేపల్లో ఔషధ గుణాలుంటాయి. పైగా ఈ చేప ధరలో మూడో వంతు మాత్రమే దాని మాంసానికి ఉంటే, మిగిలిన రెండొంతుల విలువ కేవలం దాని పొట్ట భాగానికే పలుకుతుంది.