మాజీ మంత్రి కొడాలి నాని సుమారు 18 నెలల తర్వాత రాజకీయ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. గుడివాడలో జరిగిన కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలిటికల్‌గా మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారనే దానిపై క్లారిటీ ఇచ్చారు. బైపాస్ సర్జరీ కారణంగా ఆరు నెలలు రెస్ట్ తీసుకున్నానన్న కొడాలి నాని.. మరో ఆరు నెలల తర్వాత ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని వెల్లడించారు.