చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్‌పై ధర్మ పరిరక్షణ సమితి నేత, రాామరాజ్యం వీర రాఘవరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాము రంగరాజన్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన అనుచితంగా ప్రవర్తిస్తుండగా కెమెరాలో బంధించామని, వీడియో ఫుటేజ్ లాక్కోవడానికి దాడి చేశారని ఆరోపించారు. గతంలో రంగరాజన్‌పై దాడి చేసిన ఘటనను గుర్తు చేస్తూ, ఈ ఆరోపణలు చేయటం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.