దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై తప్పుడు కేసు పెట్టడం అక్రమమన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆర్జీవీ సినిమా తీసినందుకు కేసులుపెట్టారని.. వారు వివేకం సినిమా తీస్తే తప్పులేదు.. ఆర్జీవీ తీస్తే తప్పా అంటూ ప్రశ్నించారు. దళిత మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై కేసులు మీద కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటూ తప్పుడు కేసు పెట్టారని.. ఆ సమయంలో ఆయన అసలు ఊళ్లోనే లేరన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా 8 కేసులు పెట్టారన్నారు. సోషల్‌మీడియాలో టీడీపీ నేతలు ఫేక్ ఖాతాలను సృష్టిస్తున్నారని.. తప్పుడు వ్యాఖ్యలను, అసభ్యకర పోస్టులను పెడుతున్నారపకపానే. వారే తిడతారు.. తిరిగి వారే కేసులు పెడతారని.. రాష్ట్రంలో పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.